ముందస్తు బెయిల్ ప్లీజ్: టీవీ9 రవిప్రకాష్
Published on: Thu Jul 17, 2014 10:06AM

టీవీ9 ఛానల్‌లో శాసన సభ్యుల మీద ప్రసారం చేసిన కథనం విషయంలో నమోదు చేసిన కేసు విషయంలో తనమీద అరెస్టు వారెంట్ జారీ అయ్యే అవకాశం వుంది కాబట్టి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని టీవీ9 ఛానల్ సీఇఓ రవిప్రకాష్ హైకోర్టును ఆశ్రయించారు. టీవీ9లో తెలంగాణ శాసనసభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంపై ప్రసారమైన బుల్లెట్ న్యూస్‌పై ఒక న్యాయవాది కేసు నమోదు చేశారు. దీని ఆధారంగా రంగారెడ్డి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ పోలీసులు రవి ప్రకాష్ మీద కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనను అరెస్టు చేసే అవకాశం వుంది కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని రవి ప్రకాష్ హైకోర్టును కోరారు. తాను కింది కోర్టుల నుంచే బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ తన కేసును వాదించడానికి లాయర్లు ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల తాను నేరుగా హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.


