టీవీ9 మాజీ సిఇఓ రవిప్రకాష్ కు ఊరట

 

 

కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం. లోగో అమ్మకం వంటి పలు కేసులు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. వారానికోసారి సైబర్‌క్రైమ్‌ పోలీసుల ఎదుట హాజరుకావాలని.. ఆదే సమయంలో.. దేశం విడిచి వెళ్లిపోకూడదని రవిప్రకాశ్‌ను హైకోర్టు ఆదేశించింది. రవిప్రకాష్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేస్తారని సాగుతున్న ఊహాగానాలకు.. హైకోర్టు తీర్పుతో చెక్ పడినట్లయింది.