Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టీవి నటి సూసైడ్ యత్నం
posted on: May 11, 2015 11:43AM

ప్రేమ పేరుతో మోసపోయిన ఓ బుల్లితెర నటి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించిన ఘటన సోమవారం వెలుగు చూసింది. ముంబైకి చెందిన రూపాకౌర్ అనే టీవీ ఆర్టిస్ట్ చంద్రముఖి, అంతపురం, ఆటో భారతి, శిఖరం వంటి పలు సిరియల్స్ లో నటించింది. అయితే ఈమె హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా అక్కడ ఉన్న లేక్ పోలీసులు ఆమెను రక్షించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఐసీఐసీఐ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసే తన బంధువైన కేవల్ సింగ్, రూపాకౌర్ ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ చింతల్ లో ఒక సంవత్సరం పాటు సహజీవనం కూడా చేశారు. అయితే రూపాకౌర్ గత కొద్ది కాలంగా పెళ్లి చేసుకోవాలని కోరుతుండగా అతను పెళ్లికి నిరాకరిస్తూ, ఇంట్లో వాళ్లు టీవీ ఆర్టిస్ట్‌ను పెళ్లి చేసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారని పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పాడు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది.






