ఐదుగురు పిల్లల్ని కనండి..
Published on: Sat Mar 18, 2017 4:54PM

ఒకపక్క అందరూ ఒకరూ.. ఇద్దరూ పిల్లలు చాలంటూ.. జనాభా నియంత్రణ కోసం ప్రపంచ దేశాలు చర్యలు చేపడుతుంటే.. ఇక్కడ ఒకరిని కాదు ఇద్దరిని ఏకంగా ఐదుమందిని కనమని చెబుతున్నాడు టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్. ఇంతకీ ఆయన అలా చెప్పడానికి కారణం ఏంటనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే... టర్కీలోని ఎస్కిసెహర్ పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ‘ఇద్దరు కాదు.. ముగ్గురు కాదు ఒక్కో జంట ఐదుగురు పిల్లల్ని కనాలి’ అని.. అలా చేస్తే భవిష్యత్‌లో ముఖ్యంగా యూరప్‌లో టర్కిష్‌లదే పైచేయి అవుతుందని అని ఆయన అన్నారు. దీనికి కారణం లేకపోలేదు.. యూరప్ దేశాల్లో టర్కీ దేశస్థులపై వివక్ష కొనసాగుతోందట. ఆ వివక్షను పారద్రోలాలంటే అక్కడ తమ జనాభాను పెంచుకోవడమే ప్రధాన మార్గమని ఎర్డొగాన్ అభిప్రాయం. దీంతో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.


