కాపుని కరివేపాకు ...గా చూస్తున్నారు..


కాపు ఉద్యమం మరోసారి వార్తల లోకి వచ్చింది . తమ సామాజిక వర్గాన్ని బిసి లలో చేర్చాలని డిమాండ్ మొదలయ్యింది. ఇప్పుడు జస్టిస్ మంజునాథ్ కమిషన్ కోర్ట్ లో వుంది బంతి. అయితే అసలు కాపులను బిసి లలో చేర్చాలనే డిమాండ్ ఈనాటిది కాదు.

1. అందరికి తెలియని మరో విషయం ఒకప్పుడు వీరు బిసిలే. 1919 రిఫార్మ్స్ లో వారిని బిసిలుగా గుర్తించారు. అంబేద్కర్, కాకా కాలేకర్ కమిటి కూడా వారిని బిసిలుగా గుర్తించింది .

2. 1956 వరకు వారు బిసి లుగా వున్న కాపు సామాజిక వర్గం , అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మూలం గా బిసి ల నుంచి ఒసి  లగా మారిపోయారు. అప్పుడు ముఖ్య మంత్రి నీలం సంజీవ రెడ్డి .

3. 1961 లో మళ్ళి అప్పటి ముఖ్య మంత్రి దామోదరం సంజీవయ్య కాపులను బిసి లలో చేరుస్తూ GO 3250  జారిచేశారు .

4. 1966 లో తిరిగి కాపులకు బిసి గుర్తింపును రద్దు చేసారు .

5. అప్పటినుంచి కాపు సామాజిక వర్గం ఓసి లుగా పరిగణింప బడుతోంది .

6. అయితే కాపు సామాజిక వర్గం లోని మున్నూరు కాపు , తూర్పు కాపు వర్గాల వారు మాత్రం ఇప్పటికి బిసి లగానే చెలామణి అవుతున్నారు . కోస్తా ప్రాంతానికి చెందిన కాపు సామాజిక వర్గం మాత్రం ఓసి లుగా వున్నారు .

7. 1993 లో ముద్రగడ కాపులను బిసి లలో చేర్చాలంటూ నిరవదిక నిరాహార దీక్ష కు దిగినప్పుడు అప్పటి ముఖ్య మంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి,  కాపులను బిసి లలో చేరుస్తూ GO 30 ని  జారి చేసారు .

8. అయితే ఆ జివో ని ఇంప్లిమెంట్ చేయటానికి రెండు ఇబ్బందులు వున్నాయి .
* ఒకటి ఆ జివో ..తెలగ, బలిజ, ఒంటరి ,కాపు సామాజిక వర్గాలు బిసి లలోని A, B, C, D కేటగిరి లలో ఎందులో చేర్చాలో స్పష్టం.రెండు * బిసి సంక్షేమ కమిటి న్యాయ స్తానాన్ని ఆశ్రయించటం తో ...ఆ జివో న్యాయ పరమైన చిక్కుల్లో ఇరుక్కుంది

 

 

ఎన్నో ఏళ్లుగా కాపు సామాజిక వర్గం తో కాంగ్రెస్స్ ముఖ్య మంత్రులు ఆడుకుంటున్నారు అన్నది సుస్పష్టం. కాపులను అవసరానికి బుజ్జగిస్తూ, ఆ తర్వాత కరివేపాకులా తీసిపారేస్తూ వున్నారు. చిత్త శుద్ది లేని జివో ను జారిచేయటం ద్వారా వారిని మరింత మోసం చేసారని చెప్పచ్చు. ఎందుకంటే ఏ విధంగా చూసినా ఒక్క జివో తో కాపులను బిసి లలో చేర్చటం సాద్యం కాదు .  అందుకు ఒక విధి విధానాలను మన రాజ్యాంగం స్పష్టం గా పేర్కొంది .
  
1. ఉమ్మిడి  ఆంధ్ర రాష్ట్రం లో 2004 నుంచి 2011 వరకు బిసి కమిషన్ అధికారిగా వున్న జస్టిస్ దాల్వ సుబ్రహ్మణ్యం గారి అభిప్రాయం లో పూర్తి స్తాయి సామాజిక , ఆర్దిక సర్వే ద్వారా  ఆ సామాజిక వర్గ  ఆర్దిక స్థితి గతుల విశ్లేషణ జరిగిన తర్వాత మాత్రమె వారికి ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలి అన్నది నిర్ణయించగలరు.

2. ఈ పద్దతిలోనే తమిళ నాడు ప్రభుత్వం 69 శాతం రిజర్వేషన్లు కల్పించింది .

3. ఒక సమగ్ర సర్వే తర్వాత మాత్రమే కాపు సామాజిక వర్గాన్ని బిసి లలో చేర్చవచ్చా లేదా అన్న నిర్ణయం , అలాగే చేర్చ వలసి వస్తే ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలి , అలాగే రిజర్వేషన్ పొందే అర్హతని   ఎంత మేరకు విస్తరించవచ్చు వంటి నిర్ణయాలు తీసుకోగలుగు తారు .

4. కాపు సామాజిక వర్గాన్ని బిసి లలో చేర్చే విషయమై ప్రస్తుత బిసి కమిషన్ జస్టిస్ మంజునాథ ఆద్వర్యం లో ఆ సామాజిక వర్గానికి సంబంధించి , ఒక సమగ్ర సామజిక , ఆర్దిక  సర్వే చేయాలి.  అది సమర్పించే గణాంకాలు రాజ్యంగా బద్దంగా నిర్ణయించబడ్డ విధానంలో వుండాలి.  ఆ తర్వాత మాత్రమె చంద్రబాబు అయినా, అతని ప్రభుత్వ మయినా ఆ తర్వాతి అడుగు వేయగలిగేది. అప్పుడు మాత్రమే మరోసారి మోసపోకుండా, రాజకీయపు ఆటలో అరటిపండులా మిగిలిపోకుండా కాపు సామాజిక వర్గం బిసిలుగా శాశ్వత గుర్తింపును పొందగలిగేది. చంద్రబాబు పదే, పదే చెబుతోంది అదే. కంటి తుడుపుగా ఏదో ఒక ప్రకటన చేయటం వలన కాపులకు న్యాయం జరగదు. రాజ్యాంగ బద్దంగా ఆ విధి, విధానాలను పాటిస్తూ వారికి న్యాయం జరిగేలా చూడాలి అని.

 

నిజానిజాలుని ప్రజలకి తెలియనీయకుండా, ఆవేశ పరిచే ప్రసంగాలు చేస్తూ, రెచ్చగొట్టే ప్రకటలను చేస్తూ ...కొంతమంది కేవలం ఈ అంశం ద్వారా అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టి , తమ రాజకీయ స్వలాభాలను పొందాలని చూస్తున్నారు తప్ప , నిజంగా ఆ సామాజిక వర్గానికి కొన్ని ఏళ్లుగా జరుగుతున్న అన్యాయానికి తెరపడి ఇప్పటికి అయినా వారు కోరుకున్నది దక్కేలా చూడాలన్న ఉద్దేశ్యం ఏ కోశానా కనబడటం లేదు అన్నది స్పష్టం అవుతోంది ఈ మద్య జరిగిన సంఘటనలని చూస్తుంటే