తుమ్మల నాగేశ్వరరావుకు అస్వస్థత
Published on: Tue Sep 2, 2014 10:34PM
.jpg)
ఖమ్మం జిల్లాకి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. దాంతో ఆయనను హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చేర్చారు. పది రోజుల క్రితం కూడా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు కూడా ఆయన యశోదా ఆస్పత్రిలోనే చేరారు. ఆ సమయంలో ఆయనను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతోసహా అనేకమంది తెలుగుదేశం నాయకుడు పరామర్శించారు. అయినప్పటికీ ఆస్పత్రి నుంచి కోలుకుని ఖమ్మం జిల్లాకు వెళ్ళిన ఆయన టీఆర్‌ఎస్ పార్టీలో చేరే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన ఏ పార్టీకి చెందిన నాయకుడు కాదు. సెప్టెంబర్ 5న టీఆర్ఎస్‌లో చేరాలని ఆయన భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్‌లో చేరితే ఆయనకు మంత్రి పదవి ఇస్తామని కేసీఆర్ ఆఫర్ ఇచ్చారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు.


