TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోత్కుపల్లి వాహనంపై దాడి

Published on: Thu Jan 12, 2012 8:17AM

నల్లగొండ: తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులుపై తెలంగాణ రాష్ట్ర సమితి  కార్యకర్తలు దాడి చేశారు. నల్లగొండ జిల్లా మోత్కూరు గ్రామంలో  ఈ సంఘటన జరిగింది. మోత్కుపల్లి నర్సింహులుపై తెరాస కార్యకర్తలు రాళ్లు, కోడి గుడ్లతో దాడి చేశారు. కాన్వాయ్‌ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో తెలుగుదేశం, తెరాస కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు సముదాయించి పక్కకు తోసేసి, సర్ది చెప్పారు. దాంతో పరిస్థితి సద్దుమణిగింది.మోత్కూరు గ్రామంలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు మోత్కుపల్లి నర్సింహులుకు ఆ చేదు అనుభవం ఎదురైంది. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలపై ఆగ్రహించిన తెరాస కార్యకర్తలు మోత్కుపల్లిపై దాడి చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదని తెరాస కార్యకర్తలు అన్నారు. కెసిఆర్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వారు మోత్కుపల్లిని డిమాండ్ చేశారు.