టీటీడీ.. శేఖర్ రెడ్డికి తప్పని కష్టాలు..
Published on: Tue Mar 21, 2017 11:12AM

టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి రద్దయిన నోట్ల మార్పిడి కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా జైల్లో ఉంటున్న ఈయన బెయిల్ పై విడుదలయ్యారు. అయితే అలా బయటకు వచ్చారో లేదో వెంటనే మళ్లీ అరెస్ట్ అయ్యారు. ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే అక్రమంగా ఆస్తులను కలిగివున్నారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయన్ను అదుపులోకి తీసుకుంది. శేఖర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు శ్రీనివాసులు ప్రేమ్ కుమార్ లనూ ఈడీ అరెస్ట్ చేసింది. ఆపై శేఖర్ రెడ్డిని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి, ఈ నెల 28 వరకూ కస్టడీకి అనుమతి పొందింది.
కాగా టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరుపగా.. కొన్ని కోట్లు రూపాయలు అది కూడా కొత్త రెండువేల నోట్ల కట్టలు.. ఇంకా పలు అక్రమాస్తులు బయటపడ్డాయి.


