Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే
posted on: May 20, 2025 7:18PM
.webp)
తిరుమల తిరుపతి దేవస్థాన మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల కొండల్లో ఉన్న పచ్చదనాన్ని అటవీశాఖ ద్వారా 68.14 శాతం నుండి 80 శాతానికి పెంచేందుకు నిర్ణయించారు. పచ్చదనాన్ని పెంచేందుకు రూ.4 కోట్ల కేటాయించింది. స్విమ్స్ ఆసుపత్రిలో 597 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. ఒంటిమిట్ట ఆలయంలో నిత్య అన్నదానం చేయాలని నిర్ణయించామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలో యాంటీ డ్రోన్ టెక్నాలజీ వినియోగించాలని నిర్ణయించినట్లు ఈవో తెలిపారు.
తిరుమల ఉప ఆలయాలు సమగ్ర అభివృద్ధికి కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆకాశగంగ, పాపవినాశం, కాలినడక మార్గాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. తిరుమలలో 42 వీఐపీ అతిథి గృహాలు ఆధ్యాత్మిక పేర్లు మార్చాలని నిర్ణయించినట్లు ఆలయ ఈవో శ్యామల రావు పేర్కొన్నారు. తిరుమలలో యాంటీ డ్రోన్ టెక్నాలజీ వినియోగించాలని నిర్ణయించినట్లు ఈవో తెలిపారు. టీటీడీ ఉప ఆలయాలు సమగ్ర అభివృద్ధికి కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆకాశగంగ, పాపవినాశం, కాలినడక మార్గాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. తిరుమలలో 42 వీఐపీ అతిథి గృహాలు ఆధ్యాత్మిక పేర్లు మార్చాలని నిర్ణయించినట్లు ఆలయ ఈవో శ్యామల రావు పేర్కొన్నారు.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి వేంకటేశ్వర స్వామి ఆలయం, నారాయణవనం కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, కపిలతీర్థం కపిలేశ్వర స్వామి ఆలయం, నాగాలాపురం వేదనారాయణస్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయాల అభివృద్ధి కోసం సమగ్ర బృహత్ ప్రణాళిక తయారు చేసేందుకు ఆర్కిటెక్ట్ ల నుండి సాంకేతిక, ఆర్థిక ప్రతిపాదనలు స్వీకరించాలని నిర్ణయించారు. ఇండియన్ ఆర్మీకి చెందిన సైనిక్ నివాస్ పేరు విషయంలో వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈవో వెల్ల డించారు. తిరుమలలోని బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్ల లైసెన్సు ఫీజును నిర్ణయించే అంశంపై ఆమోదం. భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు పేరొందిన సంస్థలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. టీటీడీలో పని చేస్తున్న అన్యమతస్థుల బదిలీలు.. వీర్ఎస్ దిశగా కసరత్తు చేయాలని డిసైడ్ అయ్యారు.


.webp)
.webp)


