TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలకు కేంద్రప్రభుత్వ భద్రతాదళాల రక్షణ?

Published on: Tue Mar 20, 2012 12:21PM

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం టిటిడి భద్రతా వ్యవహారాలను రాష్ట్ర పోలీసులే పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ పోలీసుల పనితీరు గతంలో అనేకసార్లు విమర్శలకు గురయింది. కొద్దిరోజుల క్రితం టిటిడి పరిపాలనా భవనం వద్ద హత్య జరిగింది. అయినా స్థానిక భద్రతాసిబ్బంది సకాలంలో స్పందించలేకపోయారు. దీనికి తోడు తిరుమలకు ఉగ్రవాదుల ముప్పు వుందని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. తిరుమలలో అతిపురాతన కాలానికి చెందిన శ్రీవారి ఆభరణాలతో పాటు టిటిడి ఖజానా ఉంది. నిత్యం హుండీలో పడిన డబ్బును లెక్కించే పరికామణి కూడా ఇదే ప్రాంతంలో ఉంది. తిరుమలకు ప్రతిరోజూ అత్యంత ప్రముఖ వ్యక్తులు దర్శనానికి వస్తుంటారు. ఈ ప్రాంతం నిత్యం లక్షలాదిమంది భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ ప్రాంతంలోకి ఉగ్రవాదులు చొరబడితే పరిస్థితి ఊహించలేనంత భయంకరంగా ఉంటుంది. అందుకే ఈ ప్రాంత పరిరక్షణ బాధ్యతను కేంద్రప్రభుత్వ భద్రతాదళాలకు అప్పగించాలన్న యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.