TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐదవ రోజు ఆర్టీసీ సమ్మె భేటీలో ఏం జరగబోతోంది?

Published on: Wed Oct 9, 2019 11:47AM

 

గత నాలుగు రోజులుగా అందరిలో కలవర పరచిన అంశం ఆర్టీసీ సమ్మె. పండుగ అయిపోయింది ఆర్టీసీ సమ్మెకు మన తెలంగాణ సీఎం ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పటు చేయంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి పండగ కూడా గడిచిపోయింది.ఆర్టీసీ సమ్మె ఈ ముఖ్యమైన పండుగలకు చేయడం పై ప్రభుత్వ అధికారులు తీవ్రంగా మండిపడుతున్నారు. మళ్ళీ నేటి నుంచి ఆర్టీసీ సమ్మె ప్రభావం  కనిపించే పరిస్థితి వస్తోంది. ఓ వైపు సర్కార్ సీరియస్ గా ఉన్న అంశం కాగా మరోవైపు పంతం వీడని ఆర్టీసీ ఉద్యోగులు వెరసి ఆర్టీసీ సమ్మె ఐదో రోజుకు చేరింది. మరి ఇవాల్టితో అయినా సమ్మె ఆగుతుందా సాగుతుందా ఎందుకంటే ఇవాళ జరగబోయేవన్నీ ఆర్టీసీ భవిష్యత్ ను సమ్మె చేస్తున్న కార్మికుల  భవిష్యత్తును తేల్చేసి సమావేశంగా మారనుంది. ఆర్టీసీ సమ్మెపై ఇవాళ కీలక సమావేశా లు జరగబోతున్నాయి. ఇప్పటికే ప్రత్యామ్నయ ఏర్పాట్లు మరింత పెంచుతున్న కేసీఆర్ సునీల్ శర్మ కమిటీ తో మరోసారి భేటీ అవుతారు ఆర్టీసీ భవిష్యత్ పై చర్చిస్తారు. మరోవైపు డిపోల వారీగా ఆయా జిల్లాల కలెక్టర్ లు సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వం చేపడుతున్న ఈ పద్దతిని గమనిస్తూ సమ్మె చేస్తున్న కార్మిక సంఘాల జేఏసీ మరోసారి భేటీ కాబోతోంది. ఆ భేటీలోనే భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని సమ్మె కొనసాగిస్తారా విరమిస్తారా అన్న వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ లో అఖిల పక్ష సమావేశం జరగనుంది. రాజకీయ పార్టీ లు నిర్వహిస్తున్న ఈ భేటీకి జేఏసీ నేతలు కూడా హాజరవుతారు. కేసీఆర్ ఈ మధ్యాహ్నం తరువాత అధికారులతో సమీక్ష జరుపుతారు. ఈలోపు జేఏసీ ఓసారి సమావేశంకానుంది ఆ తర్వాత అఖిల పక్ష భేటీకి హాజరు కాబోతోంది. ఈ భేటీ లో అయినా ఆర్టీసీ కార్మికులకు ఆనందం తెచ్చి పెట్టబోతుందో లేదో వేచి చూడాలి.