దాదాపు 75 శాతం బస్సులు నడిపిస్తున్నాం : ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వర ప్రసాద్
Published on: Sat Oct 12, 2019 10:49AM
.jpg)
ఆర్టీసీ సమ్మె ఏడో రోజు జరుగుతుంది, అయితే ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా చూసుకుంటామంటున్నారు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వర ప్రసాద్. దాదాపు డెబ్బై ఐదు శాతం బస్సులు నడుపుతున్నామని అన్ని బస్ పాస్ లు చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు ఆయన. కండక్టర్ లు అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వర ప్రసాద్ అన్నారు. ఆర్టీసీ సమ్మె ఏడవ రోజుకు చేరుకుంది, ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నపటికీ కూడా ప్రజలింకా ఇబ్బందులు మాత్రం పడుతూనే ఉన్నారు.
ప్రధాన రహదారుల్లో బస్సులు కనిపిస్తున్నా ఇంకా గ్రామాలకు బస్సులు చేరుతున్నాయా లేదా అనే ప్రశ్న మిగిలుంది. దీని గురించి వర ప్రసాద్ మాట్లాడుతూ ఎంజీబిఎస్ కి అన్ని జిల్లాల నుండి బస్సులు ఆపరేట్ అవుతా ఉంటాయని, ఎంజీబీఎస్ కు దాదాపు రోజూ మూడు వేల మూడు వందల నుండి మూడు వేల నాలుగు వందల బస్సులు రద్దీకనుగుణంగా ఆపరేట్ అవుతా ఉంటాయని అన్నారు. అన్ని ఊర్లకు కూడా ఆపరేట్ చేయడం మొదలుపెట్టామని, పద్నాలుగవ తారీఖు నుండి స్కూల్స్, కాలేజెస్ రీ ఓపెన్ అవుతున్నాయని,
కాలేజీ బస్సులు, స్కూల్ బస్సులు ఇప్పుడు స్టేజ్ క్యారేజ్ గా ఆపరేట్ చేయబడుతున్నాయని, టెంపరరీగా అవి స్కూల్స్ కు వెళతాయని, తాత్కాలిక ప్రాతిపదికన ప్రతి డిపోలో మెకానికల్ మ్యాన్ పవర్ ని తర్వాత కండక్టర్, డ్రైవర్ లను ఆపరేషన్ కి సరిపోయినంత మందిని టెంపరరీగా తీసుకుంటున్నారని తెలిపారు. నిన్నటి నుండి నైట్ ఔట్ సర్వీస్ స్టార్ట్ చేశారని, దీనిని సోమవారం వరకు నైటవుట్స్ సర్వీసెస్ ను అన్నింటినీ పునరుద్దరించి నార్మల్ ఆపరేషన్ కు తీసుకురావటానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారని, అన్ని బస్సులను ఆపరేట్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నారని వర ప్రసాద్ తెలిపారు.


