ఇంటర్ గురుకుల కాలేజీలలో ప్రవేశ పరీక్ష దరఖాస్తు తేదీ పొడిగింపు 

తెలంగాణ రాష్ట్ర గురుకుల కాలేజీలలో 2020-21 విద్యా సంవత్సరానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఆగస్టు 5తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రంలో కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు దరఖాస్తు తేదీని ఆగస్టు 5 వరకు పొడిగించారు. రాష్ట్రంలో ఉన్న 35 తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలలో  అడ్మిషన్ల కోసం నిర్వహించే టీఎస్ఆర్జేసీ సెట్ 2020 ప్రవేశపరీక్ష ద్వారా 35కాలేజీల్లో అడ్మిషన్లు జరుగుతాయి. ఇందులో బాలుర జూనియర్ కాలేజీలు 15, బాలికల జూనియర్ కాలేజీలు 20 ఉన్నాయి. మొత్తం 35కాలేజీల్లో అన్ని గ్రూపులు కలిపి 3000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపీసీ గ్రూప్ లో 1300 సీట్లు ఉన్నాయి. ప్రవేశ పరీక్షలో ఎంపికైన వారికి ఈ కాలేజీల్లో వారికి కేటాయించిన రిజర్వేషన్ల ఆధారంగా అడ్మిషన్ లభిస్తోంది. కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు జరగలేదు. దాంతో పదోతరగతి చదువుతున్న విద్యార్థులంతా పాస్ అయ్యారు. జూనియర్ కాలేజీ అడ్మిషన్ల కోసం ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 
మరిన్ని వివరాల కోసం తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీ వెబ్సైట్లో తెలుసుకోవచ్చుhttp://tsrjdc.cgg.gov.in సంపద్రించాల్సిన నెంబర్లు 040 -24734899, 9490967222