అందరి గుట్టు విప్పుతా :శంకర్రావు
Published on: Wed Dec 28, 2011 8:22AM
హైదరా
బాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిల తనకు ప్రాణహాని ఉందని రాష్ట్ర చేనేత శాఖామంత్రి పి.శంకర్రావు ఆరోపించారు. ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల తన ఇంటివద్ద జరిగిన దాడిని జగన్, సబితా ఇంద్రారెడ్డిలో ప్రేరేపించారని ఆరోపించారు.సాక్షాత్ ఒక రాష్ట్ర మంత్రిపై దాడి జరిగితే ఇప్పటి వరకు పోలీసు కమిషనర్ లేదా సామాన్య కానిస్టేబుల్ కూడా తమను విచారించలేదన్నారు. ఈ కేసులో అసలు నిందితులను వదిలిపెట్టి అమాయకులను అరెస్టు చేసి జైల్లో పెట్టారని ఆయన మండిపడ్డారు.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవినీతిపరులను వెనకేసుకొస్తున్నారని విమర్శించారు.మంత్రి కాకముందు సాదాసీదాగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి ఇపుటు కోట్లాది రూపాయలకు ఎలా పడగలెత్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.ఎన్టీఆర్ నగర్‌లో ఐదు ఎకరాలు ఆక్రమించారని విమర్శించారు.
ఇలాంటి అవినీతి మంత్రులను తక్షణం బర్తరఫ్ చేయాలని కోరారు.అక్రమాలు బయటపెడతారని భాను కిరణ్‌ను చంపారని అనుమానం వ్యక్తం చేశారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్రమాలు త్వరలో బయటపెడతానన్నారు. హుడా చైర్మన్‌గా ఆయన చేసిన అక్రమాలు వెల్లడిస్తానన్నారు. త్వరలోనే అవినీతి మంత్రుల చిట్టావిప్పి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపుతానని అప్పటి వరకు తాను విశ్రమించేది లేదని శంకర్రావు శపథం చేశారు.


