మంత్రి ఎర్రబెల్లికి కరోనా.. టీఆర్ఎస్ నేతల్లో టెన్షన్
Published on: Sat Dec 25, 2021 8:12PM
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా సోకింది. ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో ఆయన పాజిటివ్ గా వచ్చింది. దీంతో ఎర్రబెల్లి క్వారెంటైన్ లోకి వెళ్లారు. ఇటీవల వారం రోజులు రైతుల కోసం ఢిల్లీలో పర్యటించారు మంత్రి ఎర్రబెల్లి. శనివారం రాత్రే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఆదివారం దయాకర్ రావు కు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. ఎర్రబెల్లికి కరోనా నిర్దారణ కావడంతో... ఆయనతో వారం రోజుల పాటు ఢిల్లీలో గడిపిన మంత్రుల్లో ఆందోళన నెలకొంది. వాళ్లంతా కొవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారని తెలుస్తోంది.
గత మూడు, నాలుగు రోజులుగా తనను కలిసిన వారు కరోనా పరీక్షలను చేయించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. తాను ఐసొలేషన్ లో ఉన్నన్ని రోజులు తనను కలిసేందుకు ఎవరూ రావద్దని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు తన పీఏలు, అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు.


