TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిరు పిటిషన్.. జీహెచ్ఎంసీకి హైకోర్టు అక్షింతలు!

Published on: Wed Jul 16, 2025 11:28AM

మెగాస్టార్ పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి అక్షింతలు వేసింది. ఇంతకీ చిరంజీవి ఎందుకు హైకోర్టుకెక్కారు.. హైకోర్టు జీహెచ్ఎంసీకి అక్షింతలు వేసింది అన్న వివరాలలోకి వెడితే.. చిరంజీవి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో రెన్నోవేషన్ పనులు చేపట్టారు. అందులో భాగంగా రిటైన్ వాల్ నిర్మించారు.  ఇంటి పునరుద్ధరణలో భాగంగా తాను చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని చిరంజీవి జిహెచ్ఎంసి కి దరఖాస్తు చేసుకున్నారు.  గత నెల 5న చిరంజీవి జీహెచ్ఎంసీకి తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని దరఖాస్తు చేసుకుంటే.. దానినై జీహెచ్ఎంసీనుంచి ఎటువంటి స్పందనా లేదు.

దీంతో చిరంజీవి  జిహెచ్ఎంసి తీరుపై కోర్టుకెక్కారు.  చిరు తరఫున వాదించిన న్యాయవాదు.. చిరంజీవి ఇంటికి సంబంధించి 2002లోనే జిప్లస్2 నిర్మాణానికి అనుమతులు తీసుకున్నామనీ, ఇప్పుడు పునరుద్ధరణ పనులు మాత్రమే చేపట్టామని వివరించారు. ఇందులో భాగంగా చేపట్టిన నిర్మాణాలను పరిశీలంచి క్రమబద్ధికరించాలని జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు.  దీనిపై జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది.. చిరంజీవి దరఖాస్తు అందిందనీ,  చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని  కోర్టుకు తెలిపారు.

ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి జిహెచ్ఎంసి కి పిటిషనర్ దరఖాస్తు పైన చట్ట ప్రకారం ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను ముగించారు.  ఈ సందర్భంగా జీహెచ్ఎంసీపై కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అనుమ‌తులు ఇచ్చేందుకు ఎంత గ‌డువు కావాల‌ని ప్ర‌శ్నించింది. అక్ర‌మ నిర్మాణాల‌కు అధికారులు వత్తాసు ప‌లుకుతున్నార‌న్న ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని పేర్కొన్న కోర్టు.. స‌క్ర‌మ నిర్మాణాల‌కు  అనుమ‌తులు ఇవ్వ‌లేరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.