TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణలో లాక్ డౌన్? హెల్త్ డైరెక్టర్ సంచలన ప్రకటన.. 

Published on: Mon Jan 3, 2022 4:44PM

ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కొవిడ్ విలయ తాండవం చేస్తోంది. డెల్టా వేరియంట్ తో పాటు కొత్త వైరస్ ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తోంది. మన దేశంలోనూ కొవిడ్ కేసులు ప్రమాదరకంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ లో డేంజర్ జోన్ లోకి వెళ్లిపోయాయి. దేశంలో ఒక్కో స్టేట్ లాక్‌డౌన్ దిశ‌గా అడుగులు వేస్తోంది. 12 రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్‌క‌ర్ఫ్యూ కొన‌సాగుతోంది. ఢిల్లీ, బెంగాల్‌లో స్కూల్స్ క్లోజ్‌ చేశారు. మాల్స్‌, థియేట‌ర్స్‌, మెట్రోస్‌లో ఆంక్ష‌లు. 

తెలంగాణలో కరోనా కేసులు, ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో లాక్ డౌన్ విషయంపై హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కేసుల తీవ్రత పెరిగితే లాక్ డౌన్, కర్ఫ్యూ గురించి ఆలోచిస్తామన్నారు. జనవరి చివరి వారంలో లాక్ డౌన్ ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, శానిటైజర్ వాడాలని సూచించారు. కరోనా మూడో దశ ప్రమాదం కాకపోయినా.. ప్రజలు అప్రమత్తంగా వుండాలన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. 

ప్రస్తుతం రాష్ట్రంలో 15 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి టీకాలు అందించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశామని శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 18 లక్షల మంది అర్హులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు వ్యాక్సిన్‌ వేయించేందుకు ముందుకు రావాలని డీహెచ్ శ్రీనివాస రావు పిలుపునిచ్చారు.