TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఎంఐఎంకు టీఆర్ఎస్ చెంచాగిరి ! 

Published on: Thu Feb 11, 2021 4:17PM

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు ఇచ్చింది. ఇదే ఇప్పుడు తెలంగాణలో కాక రేపుతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ టార్గెట్ గా దూకుడుగా వెళుతున్న బీజేపీకి కొత్త అస్త్రం దొరికింది. దీంతో కమలం నేతలు అప్పుడే యాక్షన్ లోకి దిగారు. గులాబీ పార్టీతో పాటు పతంగి పార్టీపై ఘాటు విమర్శలు చేస్తున్నారు.  .టీఆర్‌ఎస్, ఎంఐఎం మధ్య ఉన్న అక్రమ సంబంధం మరోసారి బహిర్గతమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి భాగ్యనగరాన్ని దోచుకునే కుట్ర చేస్తున్నాయని  ఆయన ఆరోపించారు. జీహెచ్ఎంసీ‌లో టీఆర్‌ఎస్ స్టీరింగ్ ఎంఐఎమ్ చేతిలో ఉండటం ఖాయమని చెప్పారు.  


జీహెచ్ఎంసీ‌ ఎన్నికలో బీజేపీ చెప్పిన విషయం నిజమైందని.. టీఆర్‌ఎస్-ఎంఐఎం  పార్టీలు చీకట్లో ప్రేమించుకుంటూ  బయటకు మాత్రం తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని బండి ఎద్దేవా చేశారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేయక పోయి ఉంటే టీఆర్‌ఎస్‌కు సింగిల్ డిజిట్ కూడా వచ్చేది కాదన్నారు బండి సంజయ్. టీఆర్‌ఎస్ పక్కా మత తత్వ పార్టీ అయిన ఎంఐఎం చెంచా అని రుజువైందన్నారు.   సిగ్గు లేక ఎన్నికల్లో తాము వేర్వేరు అని చెప్పుకుని ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్పొరేటర్లు హైదరాబాద్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటారన్నారు. పైసా అవినీతి చేసినా, ఇంచు జాగా వదిలేసిన ఈ రెండు పార్టీలను బజారుకు లాగుతామని సంజయ్ హెచ్చరించారు.  రాష్ట్ర ప్రజలు టీఆర్‌ఎస్ నీచ రాజకీయాలను సహించారని చెప్పారు.