TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ట్రంప్ పీస్ ఆఫ్ బోర్డ్.. ఐరాసకు ఆల్టర్నేటివ్?

Published on: Thu Jan 22, 2026 9:14AM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. అంతర్జాతీయంగా తన ఆధిపత్యాన్ని మరింత ఎక్కువగా చాటుకోవడానికి నానా విధాలుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా బోర్డ్ ఆఫ్ పీస్ అంటూ ఒక కొత్త క‌మిటీ ఏర్పాటు చేశారు ట్రంప్. దీనిలో చేరాలంటూ భార‌త్, పాక్, కెనెడా, ఈజిప్ట్, హంగేరీ, అల్బేనియా, అర్జెంటీనా.. వంటి ప‌లు దేశాల‌కు ఆహ్వానం ప‌లికారు. 

ఈ బోర్డ్ ఆప్ పీస్ కమిటీలో అమెరికా విదేశాంగ మంత్రి, ఆ దేశ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు, ఆ  ట్రంప్ అల్లుడు,  బ్రిట‌న్ మాజీ ప్ర‌ధాని,   వ‌ర‌ల్డ్ బ్యాంక్ చైర్మ‌న్ వంటి వారున్నారు. ఇందులో ఇప్పటికే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరింది. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ఏర్పాటుకు గాజాలో శాంతి పునరుద్ధరణ అని చెప్పడంతో యూఏఈ ఇందులో చేరింది. అయితే విషయం ఏమిటంటే..  ఈ బోర్డు పేరుకు మాత్రమే గాజా కోసం ఏర్పడిందనీ,  ఇది ప్రపంచ వ్యాప్తంగా ఇత‌ర  దేశాల్లో ఎక్క‌డ అశాంతి ఏర్ప‌డ్డా.. అక్క‌డ ఈ బోర్డు చొర‌వ‌దీసుకుని ప‌నులు చ‌క్క‌బెట్టేందుకు ఏర్పాటు అయ్యిందనీ అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు.  

ఈ బోర్డు ఏటా ఒక సారి స‌మావేశ‌మై ప్ర‌పంచ శాంతికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకునేలా  నియ‌మావ‌ళి రూప‌క‌ల్ప‌న  జరిగింది. ఇప్ప‌టికే ఈ  మేర‌కు త‌మ‌కు కూడా ఆహ్వానం అందింద‌ని అర్జెంటీనా వంటి ప‌లు దేశాలు చెబుతుండ‌గా.. అమెరికాలోని భార‌త రాయ‌బారి మోడీకి సైతం ఈ ఆహ్వానం అందింద‌ని సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. ఈ  బోర్డ్ ఆఫ్ పీస్ ఏర్పాటులోనూ  ట్రంప్ త‌న వ్యాపార ధోరణిని కనబరిచారు. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ లో శాశ్వ‌త స‌భ్య‌త్వం కావాలంటే  బిలియ‌న్ డాల‌ర్లు చెల్లించాల్సి ఉంద‌ని ష‌ర‌తు విధించారు.  ఆహ్వానం మాత్ర‌మే  ఈ బోర్డులో చేర‌డానికి గ‌ల అర్హ‌త‌గా భావించిన దేశాల‌కు ఇంత భారీ మొత్తం  ఎంట్రీ ఫీజు ఉండ‌టంతో ఖంగు తింటున్నారు. 

ఇప్ప‌టికే ఆర్ధిక సంక్షోభం ఎదుర్కుంటున్న  పాక్ వంటి  దేశాల‌కు ఈ స‌భ్య‌త్వ రుసుము పెద్ద ఎత్తున అడ్డంకి కాగా.. భార‌త్ నుంచి ఎలాంటి స్పంద‌న ఉంటుందో తేలాల్సి ఉంది. అయితే ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ఏర్పాటు ఐక్యరాజ్యసమితికి ఆల్టర్ నేటివ్ అన్న అభిప్రాయం ప్రపంచ దేశాలలో వ్యక్తం అవుతోంది.   ఐక్య‌రాజ్య స‌మితి ప్రాధాన్యతను తగ్గించడం, అవసరమైతే ఐరాస ఉనికిని నామమాత్రం చేసి తన ఆధిపత్యాన్ని విస్తరించుకోవడమే ఈ బోర్డు ఏర్పాటు వెనుక ఉద్దేశంగా చెబుతున్నారు.  

 ట్రంప్  ప్రపంచం బాగుండాలంటే, అమెరికా బాగుండాలి అంటున్నారు. ఇక బోర్డులో శాశ్వత సభ్యత్వానికి చెల్లించాల్సిన ఫీజు భారీగా ఉండడాన్ని బట్టి అమెరికా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని అవగతమౌతోందని కూడా చెబుతున్నారు.  ఆయుధాలు, సైన్యంపై భారీగా వెచ్చించేసిన అమెరికా ఇప్పుడు ఆర్థిక సమస్యలతో సతమతమౌతోందనీ, అందుకే ట్రంప్ నిత్యం ఏదో ఒక యుద్ధం వ‌చ్చేలా  చేసి.. త‌ద్వారా త‌మ ఆయుధాల‌ను స‌ర‌ఫ‌రా చేసి వాటి ద్వారా ల‌బ్ధి పొందాల‌ని చూస్తున్నారనీ అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల‌ నిపుణులు అంటున్నారు.