ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి?

 

ట్రంప్.. అమెరికా ప్రెసిడెంట్ గా పోటీకి దిగడంతో ఈ పేరు ప్రపంచానికి పరిచయమైంది.. ట్రంప్ అంటే వివాదాలు.. ట్రంప్ అంటే విమర్శలు, జోకులు.. ఇలాంటి ట్రంప్ ఎవరి అంచనాలకు అందకుండా అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు.. ఇప్పుడు ఏకంగా శతృదేశం ఉత్తర కొరియా, ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి అనే స్థాయికి చేరుకున్నాడు.. వివాదాలు, గొడవలు చుట్టూ తిరిగే ట్రంప్ మొన్నటి వరకు ఉత్తర కొరియాతో కూడా గొడవ పెట్టుకున్నాడు..ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్, ట్రంప్ ల మధ్య మాటల యుద్ధం చూసి, ప్రపంచ యుద్ధం వస్తుందని అందరూ భయపడ్డారు.. కానీ ట్రంప్, కిమ్ తో భేటీ అయ్యి ప్రపంచ శాంతి వైపు అడుగులు వేసాడు.. ఆ భేటీ సత్ఫలితం ఇచ్చింది, ఇరు దేశాల మధ్య అణురహిత ఒప్పందానికి పునాది పడింది.. అలానే ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య శాంతి ఒప్పందానికి బాటలు వేసింది.. ఇవన్నీ కలిసి ట్రంప్ ని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యేలా చేసాయి.. నార్వేలోని ఇద్దరు పొలిటీషియన్స్ ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని నామినేట్ చేసారు.. గతంలో దక్షిణా కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ మరియు అమెరికాలోని కొందరు రిపబ్లికన్లు కూడా ట్రంప్ కు నోబెల్ ఇవ్వాలని కోరడం విశేషం.