ట్రంప్, కిమ్ ల భేటీ.. ఫలితం ఏమిటి?

 

'శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరు' అనే  డైలాగ్.. మన దేశ రాజకీయాల్లో బాగా వింటుంటాం.. అయితే ఈ డైలాగ్ మన దేశ రాజకీయాలకే కాదు.. ప్రపంచం మొత్తానికి సరిగ్గా సరిపోతుందని ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ నిన్న మొన్నటి వరకు బద్ద శత్రువులు.. ఒకరి పేరు ఒకరు వింటే చాలు ఒంటికాలు మీద లేస్తారు.. అంతెందుకు ఇద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది.. అమెరికా మీద అణుబాంబులు వేస్తామని కిమ్ బెదిరిస్తే.. ఉత్తర కొరియాని అసలు మ్యాప్ లో లేకుండా చేస్తానంటూ ట్రంప్ అన్నాడు.. ఇలా వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం చూసి.. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని ప్రపంచ దేశాలు భయపడ్డాయి.. అయితే ఎవరి ఊహలకి అందకుండా.. ట్రంప్, కిమ్ లు యుద్ధం వైపు కాకుండా సయోధ్య వైపు అడుగులు వేశారు.. ఇది ప్రపంచ దేశాలకు మూడో ప్రపంచ యుద్ధం కంటే షాకింగ్ గా మారింది..

అసలు ట్రంప్, కిమ్ ల భేటీ ఏంటంటూ ప్రపంచమంతా ఆశ్చర్యంతో చూసింది.. అలా చూస్తుండగానే వీరిద్దరి భేటీకి ముహూర్తం ఖరారైంది.. భేటీ కూడా జరిగింది.. ట్రంప్, కిమ్ ల స్నేహపూర్వక కరచాలనంతో మొదలైన భేటీ సుమారు గంటన్నర పాటు సాగినట్టు తెలుస్తుంది.. మొదట కొంచెం ఆచి తూచి వ్యవహరించిన వీరిద్దరు, తరువాత బాగానే స్నేహపూర్వకంగా మాట్లాడారు.. ఈ భేటీలో ప్రధానంగా అణ్వాయుధ రహిత ఒప్పందం గురించి చర్చించినట్టు తెలుస్తుంది.. ఈ ఒప్పందంపై ఇద్దరు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది.. మొత్తానికి వీరిద్దరి భేటీ వల్ల ఇరు దేశాల మధ్య శాంతి నెలకుంటుందని విశ్లేషకులు అంటున్నారు.. చూద్దాం ఇంకా ముందు ముందు ఈ భేటీ ఎలాంటి ఫలితాలు ఇస్తుందో.