మొన్న తుగ్ల‌క్.. నిన్న జ‌గ్ల‌క్.. నేడు ట్రంప్ల‌క్!

ఒక‌ప్పుడు తుగ్ల‌క్- ఆ త‌ర్వాత జ‌గ్ల‌క్- ఇప్పుడు ట్రంప్ల‌క్. ఏంటీ కొత్త పద ప్ర‌యోగాలంటారా?  మొన్న‌టి వ‌ర‌కూ నాటి తుగ్ల‌క్ వార‌సుడు జ‌గ‌న్ మాత్ర‌మేన‌ని అనుకున్నారు చాలా మంది. ఎందుకంటే ఆయ‌న ఒక‌టి  చెప్పి మ‌రొక‌టి చేస్తారు.  ఉదాహ‌ర‌ణ‌కు సినీ ప‌రిశ్ర‌మ‌ను ఏపీకి ఎలాగైనా ర‌ప్పించాల‌ని చెప్పి సినిమా వారితో చ‌ర్చ‌లు సాగిస్తే.. ఆ సినిమా ప‌రిశ్ర‌మ కాస్తా మ‌రో మూడ‌డుగులు వెన‌క్కు వెళ్ల‌డం మాత్ర‌మే  కాదు.. చిరంజీవిలాంటి హేమా హేమీలు చేతులు క‌ట్టుకుని అభ్య‌ర్ధించాల్సి వ‌చ్చింద‌న్న మెసేజ్ ప‌బ్లిక్ లోకి వెళ్లింది. చివ‌రికి ఎలాగైనా స‌రే చిత్ర ప‌రిశ్ర‌మ  ఏపీకి రావాల‌న్న కోణంలో రోజా భ‌ర్త ఆర్కే సెల్వ‌మ‌ణి ద్వారా కోలీవుడ్ ని ఒప్పించి.. త‌డ‌, దొర‌వారిస‌త్రం వంటి స‌రిహ‌ద్దు గ్రామాల్లో వారికి  విరివిగా భూములిస్తామ‌న్న ఆశ క‌ల్పించారు. ఆపై మ‌ద‌న‌ప‌ల్లి హార్స్ లీ హిల్స్ ద‌గ్గ‌ర యాత్ర ద‌ర్శ‌కుడు మ‌హి వీ రాఘ‌వ‌న్ కి భూములు ఇస్తార‌న్న టాక్ కూడా వినిపించింది. 

ఎక్క‌డో పాత‌బ‌డ్డ నాటు తుపాకీలాంటి విజ‌య్ చంద‌ర్, ఆపై నోటు దురుసు ఎక్కువ‌గా ఉండే పోసాని, పదవి ఆశచూపిఆలీ వంటి వారిని పోగేసి.. ఇక్క‌డ సినిమా ప‌రిశ్ర‌మ రావాల‌న్న కోణంలో పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు సాగించారు. కానీ అది ఎంత మాత్రం సాధ్య ప‌డ‌లేదు స‌రిక‌దా రివర్స్ అయ్యింది. నిజంగా సినిమా వారినంటూ అంత‌గా ఆహ్వానించాలంటే అందుకు త‌గిన కుటుంబాల నుంచి కొంద‌ర్ని ఎంపిక చేయాలి..  వారికంటూ మంచి మంచి సినిమా ప‌ద‌వులు ఇవ్వాలి..  ఆపై ఎప్ప‌టి  నుంచో పెండింగ్ లో ఉన్న నంది అవార్డులును ఇచ్చి స‌త్క‌రించాలి. ఇంకా టికెట్ల ధ‌ర‌ల విష‌యంలో స‌ర‌ళీకృత విధానాల‌ను ప్ర‌వేశ పెట్టి వారి మ‌న‌సు చూర‌గొనాలి. 

ఇలా  ఎన్నో మార్గాలుండ‌గా వాట‌న్నిటినీ వ‌దిలి పెట్టి జ‌గ‌న్ త‌న‌దైన ఫ్యాక్ష‌న్ పాలిట్రిక్స్ తో సినిమా వారిని భ‌య పెట్టాల‌ని చూశారు. బేసిగ్గా సినిమా వాళ్లు ఎక్క‌డుంటారంటే, పాల‌నా ప‌రంగా మంచి, మ‌ర్యాద మ‌న్న‌న‌, ఆపై కూల్ వెద‌ర్ ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల్లో ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌తారు. వారిని అంత స‌జావుగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అదే జ‌గ‌న్ ఏం చేశారు. త‌న అనుభ‌వ రాహిత్యంతో పాయింట్ బ్లాంక్ లో గ‌న్ను పెట్టి అర‌వై నాలుగు క‌ళ‌లు ప్ర‌ద‌ర్శించ‌మంటే ఎలా సాధ్యం కాదో స‌రిగ్గా అలాగే బిహేవ్ చేశారు. చివ‌రికి ఏమైందంటే.. జ‌గ‌న్ని వెళ్లి మేం క‌ల‌వ‌డ‌మా? వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఎలాగూ ఆయన ఓడిపోతారు.. మారిన ముఖ్య‌మంత్రిని వెళ్లి క‌లుద్దాంలే.. అంటూ నిర్మాత‌ల మండ‌లి భావించేంతగా వారిని  హ‌డ‌లెత్తించారు.

ఇప్పుడు తుగ్ల‌క్ మ‌రో వార‌సుడు ట్రంప్ల‌క్ విష‌యానికి  వ‌ద్దాం.. ఇత‌గాడు ఎంత‌టి ఘ‌నుడంటే.. మార్క్ జుక‌ర్ బ‌ర్గ్, టిమ్ కుక్ ని అటుంచితే.. అక్క‌డికి వ‌చ్చిన స‌త్యానాదెళ్ల‌, సుంద‌ర్ పిచాయ్ వంటి వారికి ఇక్క‌డ ఉద్యోగాలు వ‌ద్ద‌ని చెప్పేంత పిచ్చితనం ఉంది ఆయనకు . మ‌ళ్లీ వాళ్ల‌నే ఎదురు కూర్చోబెట్టి.. అమెరికాలో మీరెంత పెట్టుబ‌డులు పెడ‌తార‌ని అడుగుతారు. భార‌తీయ వ‌స్తువులు వ‌ద్దు, భార‌తీయ వ్య‌క్తులు వారి వారి మేద‌స్సులు వ‌ద్దు వ‌ద్దంటూనే వారినే ఎదుట కూర్చోబెట్టి మీ బిజినెస్ ప్లాన్స్ ఎలా ఉన్నాయ్.. అమెరికాలో ఎంత‌లేసి పెట్టుబ‌డులు పెడ‌తార‌ని అడ‌గ‌టం.. క‌రెక్టేనా? అన్న‌ది ఒక ప్ర‌శ్న కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కూ ట్రంప్ ఎలాంటి వ్యాపారం చేశారో తెలీదు కానీ.. ఈ భ‌య‌పెట్టి, బ్లాక్ మెయిల్ చేసి, రాంగ్ కామెంట్లు గుప్పించి.. వారి చేత మొండిగా పెట్టుబ‌డులు పెట్టించ‌డం అన్న‌ది క‌రెక్టేనా? అని ట్రంప్ త‌న‌కు తాను ఎందుకు చెక్ చేసుకోరు? ఇందుకేగా ఇత‌డ్ని తుగ్ల‌క్ వార‌సుడ‌న్న‌ది అంటున్నారు చాలా మంది. భార‌త్ పై  అద‌న‌పు సుంకాల‌ను వేసి.. ఆపై వార్ని తాము చైనాకు కోల్పోతున్నామ‌ని బాధ ప‌డుతూ.. త‌ర్వాత సారీ చెప్పి మీరు మ‌ళ్లీ అమెరికాకు ఎగుమ‌తులు చేసుకోవ‌చ్చ‌ని.. ఇలా  ర‌క‌ర‌కాల వేషాలు.. కేవ‌లం తుగ్ల‌క్ పూనిన వారికి మాత్ర‌మే సాధ్యం అన్న‌ది చాలా మంది అంటోన్న మాట‌. మ‌రి మీరేమంటారు?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu