ఇమ్మిగ్రెంట్లపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు... ఆ చెత్త దేశాలు అవసరమా..

 

గత కొద్దికాలంగ్ సైలెంట్ గా ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి  తన నోటికి పని చెప్పారు. ఈసారి ఇమ్మిగ్రెంట్లపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి జాతివివక్షతను తెరపైకి తెచ్చారు. డెమోక్రాటిక్‌ సెనేటర్‌ డిక్‌ డర్బిన్‌, రిపబ్లికన్‌ సెనేటర్‌ లిండ్సే గ్రహాంలు వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో బైపార్టిసన్‌ ఇమ్మిగ్రేషన్‌ డీల్‌ గురించి చర్చిస్తుండగా... నార్వేలాంటి దేశాలకు చెందిన ఇమ్మిగ్రెంట్లను అమెరికా ఆహ్వానించాలి కానీ.. హైతీ, ఆఫ్రికన్‌ వంటి చెత్త దేశాలకు చెందిన ఇమ్మిగ్రెంట్లను అమెరికా ఎందుకు అనుమతించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. నార్వే ప్రధాని ఎర్నా సోల్బర్గ్‌తో ట్రంప్‌ సమావేశమైన తరువాత... ఆయన నార్వే వాసుల గురించి ప్రస్తావించడం గమనార్హం. ట్రంప్‌ వ్యాఖ్యలపై వైట్‌హౌస్‌ ప్రతినిధి రాజ్‌షా స్పందిస్తూ.. కొందరు వాషింగ్టన్‌ నేతలు విదేశాల కోసం పోరాడుతుంటారు కానీ ట్రంప్‌ మాత్రం అమెరికా ప్రజాల కోసమే పోరాడుతుంటారని తెలిపారు. దీంతో ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.