ట్రంప్ కొత్త ఆదేశాలు... వేల ఉద్యోగాలు....
Published on: Sat Apr 29, 2017 12:07PM

ఇప్పటివరకూ పలు నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ టెన్షన్ పెడుతున్న ట్రంప్ ఇప్పుడు తాజాగా కొత్త ఆదేశాలపై సంతకం చేశారు. అయితే ఈసారి ట్రంప్ చేసిన సంతంకంతో అమెరికన్లకు ఉద్యోగాలు రానున్నాయి. ఆర్కిటిక్, అంటార్కిటికాలో ఆయిల్ డ్రిల్లింగ్‌పై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ ఆదేశాలిచ్చారు. దేశంలో కావాల్సినంత సహజ వనరులు ఉన్నాయని, ఇన్నాళ్లూ దాదాపు 94 శాతం ఆఫ్‌షోర్ ఇంధన నిక్షేపాలను నిరుపయోగం ఉంచారని, ఇప్పుడు ఈ ఆదేశాలతో ఉద్యోగాల వెల్లువ మొదలవుతుందని ట్రంప్ అన్నారు.


