TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ట్రంప్ నిర్ణయం..అందరూ షాక్..

Published on: Tue Mar 14, 2017 11:47AM

 

ఎప్పుడూ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ భయపట్టే డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ నిర్ణయం తీసుకోవడంతో అందరూ షాకవుతున్నారు. ఇంతకీ అందరినీ అంత షాకింగ్ కు గురిచేసిన ట్రంప్ నిర్ణయం ఏంటనుకుంటున్నారా..? అదేంటంటే.. తన వార్షిక వేతనాన్నంతటినీ విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. డొనాల్డ్ ట్రంప్ తన వార్షిక అధ్యక్ష జీతం 400,000 డాలర్ల(రూ.2,64,82,000)ను ఈ  ఏడాది చివర్లో చారిటీకి విరాళంగా  ఇవ్వబోతున్నట్టు అధికార ప్రతినిధి సీన్ స్పైసర్ తెలిపారు. కాగా ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ట్రంప్ తన వేతనాన్ని విరాళంగా ఇస్తానని పలుమార్లు చెప్పిన సంగతి తెలిసందే. కేవలం ఒక్క డాలర్ ను మాత్రమే వేతనంగా తీసుకోబోతున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగానే ఆయన ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇప్పటివరకూ కఠిన నిర్ణయాలు తీసుకున్న ట్రంప్ తనకి ఈ నిర్ణయంతో తనకి కూడా సహృదయం ఉందని నిరూపించారు.