TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇల్లు విడిచి పారిపోయిన కెనడా ప్రధాని

Published on: Sun Jan 30, 2022 4:24PM

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ తన కుటుంబాన్ని తీసుకొని ఓ రహస్య ప్రదేశానికి పారిపోయాడు. దాదాపు గత 24 గంటలుగా ఆయన లొకేషన్ ఎక్కడుందనేది ఆయన భద్రతా సిబ్బంది బయట పెట్టడం లేదు. ఇంతకీ ఇందుకు దారితీసిన పరిస్థితులేంటనేది వింటే ఆశ్చర్యంతో పాటు ఆందోళన కూడా కలుగక మానదు. దేశంలోని ట్రక్కు డ్రైవర్లందరూ వ్యాక్సిన్ తీసుకోవడాన్ని తప్పనిసరి చేస్తూ కెనడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్నట్టు  సర్టిఫికెట్ గనక చూపకపోతే.. వారికి కరనో వైరస్ గనక సోకినట్లయితే అలాంటివారికు 14 రోజుల పాటు క్వారంటైన్ తప్పదంటూ నిబంధనలు కఠినతరం చేశారు. దేశంలో థర్డ్ వేవ్ విజృంభిస్తున్న  వేళ ట్రూడూ రూల్స్ ను స్ట్రిక్టు చేశారు. 

ఈ నిబంధనలు జీర్ణించుకోలేని ట్రక్కు డ్రైవర్లు భారీ సంఖ్యలో నిరసనకు పూనుకున్నాయి. వేలాదిగా ట్రక్కులు ఒట్టావాలోని ట్రూడూ అధికారిక నివాసంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించాయి. దేశంలో ఉన్న ట్రక్కు డ్రైవర్ల సంఘాలన్నీ ఇందులో పాల్గొనడంతో ఒట్టావా వీధులన్నీ ట్రక్కులతో  కిక్కిరిసిపోయాయి.  వారిని కంట్రోల్ చేయడం భద్రతా దళాలకు సాధ్యం కాలేదు. 14 రోజుల క్వారంటైన్ రూల్ ను ఎత్తేయాలని, లేనిపక్షంలో ప్రధాని అధికార నివాసాన్ని ముట్టడిస్తామంటూ దూసుకొచ్చారు. దీంతో భద్రతాసిబ్బంది ట్రూడూ కుటుంబాన్ని సేఫ్ ప్లేస్ కు తరలించి ఆ సమాచారాన్ని రహస్యంగా ఉంచుతున్నారు. 

అమెరికా నుంచి కెనడాకు వస్తున్నవారి ద్వారా వైరస్ విపరీతంగా విస్తరిస్తోందని, అది కూడా ట్రక్కు డ్రైవర్ల ద్వారానే వ్యాపిస్తోందని కెనడా సర్కారు అనుమానిస్తోంది. అందుకే వారు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపించాలి లేదా క్వారంటైన్ కు వెళ్లాలంటూ నిబంధన విధించింది. ట్రక్కు డ్రైవర్లకు తోడు రైతు సంఘాలు కూడాా ఈ నిరసనలో పాల్గొనడంతో ఒట్టావా వీధుల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి  నెలకొంది. అయితే దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోందని, ఆ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి  నెపాన్ని వ్యాక్సినేషన్ మీదికి నెడుతున్నారని విపక్షాలు, పలువురు మేధావులు ఆరోపిస్తున్నారు.