TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం

Published on: Mon Jun 3, 2019 12:18PM

 

తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ మూడు స్థానాలకు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టారు. వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై 825 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. నల్గొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మిపై టీఆర్ఎస్ అభ్యర్థి చిన్నపరెడ్డి 226 ఓట్ల తేడాతో గెలుపొందారు. రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి.. కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డిపై 244 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.