TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎంపీ గారి పదవికి చిక్కులు.. సర్వే ప్లాన్ పారుద్దా..?

Published on: Wed Jan 20, 2016 2:36PM

వరంగల్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీచేసి పసునూరి దయాకర్ రావు ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎంపీగారి పదవికి చిక్కులొచ్చి పడ్డాయా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి.

టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి 2014 లో వరంగల్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి గెలుపొందారు. అయితే తరువాత ఆయనను డిప్యూటీ సీఎం చేయడం.. అనంతరం ఆపదవికి ఆయన రాజీనామా చేయడంతో వరంగల్ ఉపఎన్నికలు నిర్వహించారు. అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎల్ తరుపున పసునూరి దయాకర్ రావును బరిలో దింపారు కేసీఆర్. అందరూ అనుకున్నట్టే టీఆర్ఎస్ పార్టీనే లోక్ సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు ఉపఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన పసునూరి దయాకర్‌కు ఎన్నికల్లో పోటీచేసే అర్హత లేదని, ఆ స్థానం నుంచి తాను గెలుపొందినట్లుగా ప్రకటించేలా ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్‌ నేత సర్వే సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. నామినేషన్‌ దాఖలు నాటికి దయాకర్‌కు ప్రభుత్వ సంస్థ భారత్‌ పెట్రోలియంతో ఎల్పీజీ డిస్ర్టిబ్యూటర్‌గా కాంట్రాక్టు ఉందని.. ప్రభుత్వరంగ సంస్థలతో కాంట్రాక్టు ఒప్పందం ఉన్న వ్యక్తులు ప్రజాప్రాతినిధ్య చట్టం-1951,సెక్షన్‌ 9ఏ కింద ఎన్నికలలో పోటీకి అనర్హులని పిటిషన్లో పేర్కొన్నాడు.

సర్వే నారాయణ కాంగ్రెస్ పార్టీ తరుపున వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. అసలు మొదట రాజయ్యకు ఎంపీ టికెట్ ఇవ్వగా.. కొన్ని అనుకొని పరిణామాల వల్ల ఆ టికెట్ సర్వేకు ఇవ్వడం జరిగింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసిన సర్వే రెండో స్థానంలో గెలుపొందాడు.

మరి సర్వే చెప్పినట్టు పసునూరి గురించి నిజ నిజాలు తెలియాలంటే కోర్టులో విచారణ జరగాల్సిందే. ఒకవేళ అది నిజమని తెలిస్తే దయాకర్ కు పదవి గండం మాత్రం తప్పదు. మరి ఈలోపు అధికార పార్టీ సైలెంట్ గా ఉంటుందా.. ఏదో మతలబు చేసి అందులో నిజం లేదని చెప్పించినా చెప్పించవచ్చు.. చూద్దాం ఏం జరుగుతుందో.