TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీఆర్‌ఎస్‌ ప్లీనరీ మెనూ చూస్తే మీరు షాక్ తింటారు?

Published on: Thu Apr 20, 2017 12:13PM

అసలే అధికార పార్టీ... పైగా ప్లీనరీ... ఏర్పాట్లకు కొదువే ఉండదు... గాలి జనార్దన్‌రెడ్డి కూతురి పెళ్లి కంటే వైభవంగా ప్లీనరీ జరనుంది. ఏర్పాట్లు వరకూ ఓకే... మరి అక్కడికొచ్చే నేతలకు, కార్యకర్తలకు ఎలాంటి వంటకాలు వడ్డించబోతున్నారో తెలిస్తే ...మనమూ వెళ్తే పోలే అనుకుంటాం. పార్టీ ప్లీనరీ అంటే భారీ ఏర్పాట్లు, తోరణాలు, స్వాగత ఏర్పాట్లే కాకుండా వచ్చిన వారికి ....నచ్చిన ఫుడ్ పెట్టేందుకు పెద్దఎత్తున వంటకాలను రెడీ చేయిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ వంటకాల రుచి చూపించబోతున్నారు. 

 

తెలంగాణలో నాన్ వెజ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే కర్రీల లిస్ట్ పెద్దగా ఉంది. దీంతోపాటు మిగతా మెనూ భారీగానే ఉంది. మొత్తం 24 వంటకాలను సిద్ధంచేస్తున్నారు. మటన్ బిర్యానీ, ధమ్ చికెన్ ఫ్రై, మటన్ షారువా, ఫిష్ ఫ్రై, మటన్ దాల్శా, ఎగ్ పులుసు‌తోపాటు ప్లెయిన్ పుల్కా, మిర్చికా సలాడ్, బగారా రైస్, ప్లెయిన్ రైస్, ఆలూ టమాటా కర్రీ, గంగాబావి యాంజిదాల్, పప్పు చారు, పచ్చి పులుసు, పెరుగు చట్నీపెరుగు... సిద్ధం చేయబోతున్నారు.  

 

సమ్మర్‌ కావడంతో అందుకు తగ్గట్టుగా ఐస్‌క్రీమ్స్‌, ఫ్రూట్‌ సలాడ్స్‌, స్వీట్లు తయారు చేయిస్తున్నారు, ఆ లిస్టులో ఫైనాపిల్ ఫెర్నీ స్వీటు, ఫ్లమ్ కేక్ ఐస్ క్రీమ్‌, కట్ ఫ్రెష్ ఫ్రూట్, స్వీట్ పాన్, గ్రీన్ సలాడ్, ఆనియన్ సలాడ్ లాంటివి సిద్ధంచేస్తున్నారు. మొత్తానికి ప్లీనరీకి వచ్చినవాళ్లకి కడుపు నిండా భోజనం పెట్టేందుకు టీఆర్‌ఎస్‌ లీడర్లు భారీ ఏర్పాట్లే చేస్తున్నారు.