కేసీఆర్ నిర్ణయం.. ఆందోళనలో నేతలు.!!
Published on: Thu Jul 19, 2018 12:45PM
టీడీపీ, కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టిన విషయం తెలిసిందే.. ఈ అవిశ్వాసానికి కాంగ్రెస్,తృణమూల్, ఎస్పీ,సీపీఎంతో పాటు మరికొన్ని పార్టీలు మద్దతు తెలిపాయి.. అయితే ఈ అవిశ్వాసానికి తెలంగాణ అధికార పార్టీ తెరాస మద్దతు తెలపలేదు.. దీంతో కేసీఆర్ నిర్ణయం సరైనదేనా అంటూ చర్చలు మొదలయ్యాయి.

కేసీఆర్ కాంగ్రెస్ తో పాటు బీజేపీని కూడా వ్యతిరేకిస్తూ థర్డ్ ఫ్రంట్ దిశగా అడుగులు వేశారు.. మరి ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా అవిశ్వాసం పెడితే ఎందుకు మద్దతు తెలపడం లేదంటూ కొందరు అభిప్రాయపడుతోన్నారు.. మరోవైపు కేసీఆర్ నిర్ణయం పట్ల సొంత పార్టీ నేతలే ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే తెలంగాణలో తెరాస, ఏపీలో వైసీపీ బీజేపీతో కుమ్మక్కు అయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి.. ఇలాంటి సమయంలో అవిశ్వాసానికి మద్దతు తెలపకపోతే, తెరాస నిజంగానే బీజేపీతో దోస్తీ చేస్తుందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.. దీని వల్ల మైనారిటీ ఓటు బ్యాంకు తెరాసకు దూరమయ్యే అవకాశం ఉందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది.. చూద్దాం మరి కేసీఆర్ నిర్ణయం ముందు ముందు ఎలాంటి ప్రభావం చూపుతుందో.


