TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉపరాష్ట్రపతి ఎన్నికకు కూడా టి.ఆర్‌.ఎస్‌.దూరం?

Published on: Mon Aug 6, 2012 10:47AM

భారత ఉపరాష్ట్రపతిగా కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన హమీద్‌ అన్సారీ గెలుపు నల్లేరుపై నడక అని రాజకీయవిశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల జరిగిన భారతరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలపరిచిన ప్రణబ్‌ముఖర్జీ విజయం సాధించిన విషయం అందరికే తెలిసిందే. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కూడా ఇదే తరహా వాతావరణం నెలకొంటోంది. దీంతో అన్సారీ గెలుపు కోసం కాంగ్రెస్‌ పెద్దలకు పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా పోయింది. రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనూ తెలుగుదేశం పార్టీ ఓటింగులో పాల్గొనరాదని నిర్ణయం తీసుకుంది. టిఆర్‌ఎస్‌ కూడా ఓటింగును బహిష్కరించింది. ఇప్పుడు కూడా అదే తరహాలో తెలుగుదేశం పార్టీ ఓటింగుకు దూరమవుతోంది. టిఆర్‌ఎస్‌ కూడా సరైన కారణం వెతుక్కుని ఓటింగ్‌లో పాల్గొనకపోవచ్చని తెలుస్తోంది. దీంతో ఈ రెండు పార్టీలు ఓటింగులో పాల్గొనకపోయినా కాంగ్రెస్‌ తన మద్దతుదారులు, పార్టీలోని నేతల సహాయంతో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవచ్చు.

 

ఈమేరకు ముందస్తుగా ఏర్పాటు చేసుకున్న ఆ పార్టీ అభ్యర్థి ప్రకటన కూడా తమ పార్టీ అథినేత సోనియాగాంధీతో చేయించి అప్పుడే సమీకరణలను పూర్తి చేశారు. అందువల్ల భారత ఉపరాష్ట్రపతిగా హమీద్‌ అన్సారీ గెలుపుఖాయమన్న సంకేతాలు వెలువడ్డాయి. సంఖ్యాబలం ప్రకారమూ అన్సారీ ముందంజలో ఉన్నారని పలు సర్వేలు తేల్చాయి.