బస్సు బోల్తా: టీఆర్ఎస్ నాయకులకు గాయాలు
Published on: Tue Jul 1, 2014 10:45AM
.jpg)
టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు విహారయాత్రలో వున్నారు. సదరు ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న వోల్వో బస్సు మంగళవారం తెల్లవారుఝామున అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ యాక్సిడెంట్లో ఆరుగురు టీఆర్ఎస్ ఎంపీటీసీలు గాయపడ్డారు. వారిని గుత్తిలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 4వ తేదీన మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీటీసీల బృందం విహారయాత్రకు బయలుదేరింది. విహారయాత్రలో వుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది.


