హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనం ఒప్పుకోం.. ఎంపీ వినోద్
Published on: Wed Aug 20, 2014 6:15PM
.jpg)
హైదరాబాద్‌పై గవర్నర్‌కి అధికారాలు కల్పించడాన్ని వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ ఈ విషయంలో రాజీలేని పోరాటం చేస్తోంది. హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు కల్పించవద్దని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. ఇదే అంశంపై గురువారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అవనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గురువారం ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు అందరూ రాజ్‌నాథ్ సింగ్‌ను కలవనున్నట్లు చెప్పారు.


