ఏపీ సరే మరి తెలంగాణ సంగతేంటి?
Published on: Tue Jul 24, 2018 5:28PM
రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో అంశాలు, ప్రత్యేక హోదా హామీ అంశాలపై చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా తెలంగాణ ఎంపీ కేశవరావు మాట్లాడారు.విభజన చట్టం వల్ల తెలంగాణ కూడా నష్టపోయిందని,తెలంగాణకు ఎందుకు సానుభూతి తెలపడంలేదో అర్థం కావడం లేదన్నారు.విభజన చట్టంలో ఏపీ, తెలంగాణకు ఇచ్చిన అన్ని హామీలనూ నెరవేర్చాల్సిందేనన్నారు.అమలు కానప్పుడు చట్టం చేయడం దేనికని మండిపడ్డారు.విభజన చట్టంలో ఇప్పటి వరకు ఏం అమలయ్యాయని ప్రశ్నించారు.

హైకోర్టు విభజన సంగతి ఏమైందని, హైకోర్టు విభజన గురించి ఎప్పుడు అడిగినా కేంద్ర న్యాయ శాఖమంత్రి నవ్వుతుంటారని అన్నారు.హైదరాబాద్‌లో మాల్స్, స్టోర్లు, బహుళ అంతస్థుల భవనాలు ఏవి తెలంగాణ వాళ్లవి కావు.కిళ్లీ షాపులు, సైకిల్ పంక్చర్ షాపులు మాత్రమే తెలంగాణ వాళ్లవి అన్నారు.60 ఏళ్లుగా చూస్తున్నది ఇదేనన్నారు.కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారని, దాని వల్ల సీలేరును నష్టపోయామన్నారు.విభజన తర్వాత ఏపీ కరెంటు ఇస్తుందన్నారు.కానీ ఏపీ ఇవ్వకపోవటంతో ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంట్ కొనుక్కున్నామన్నారు.


