బాలయ్యపై తెలంగాణ ఎంపీ కవిత ప్రశంసల జల్లు

బాలయ్య ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే.. కవిత తెలంగాణాలో తెరాస ఎంపీ.. ప్రాంతాలు వేరు, పార్టీలు వేరు.. మరి కవిత, బాలయ్య మీద ప్రశంసల జల్లు ఏంటి అనుకుంటున్నారా.. బాలయ్య నేతృత్వంలో నడుస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వార్షికోత్సవానికి కవిత హాజరయ్యారు.. ఈ సందర్బంగా మాట్లాడిన కవిత 'ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి.. ఆయనది అందరికీ సాయం చేసే మనస్తత్వం.. ఎన్టీఆర్ నటనను వారసత్వంగా తీసుకున్న బాలయ్య ఆయన సేవా దృక్పథాన్ని కూడా అలవరచుుకున్నారు' అని కవిత అన్నారు.. ఎన్టీఆర్ గొప్ప లక్ష్యంతో బసవతారకం ఆసుపత్రి పెట్టారు, దీన్ని బాలయ్య ప్రపంచస్థాయికి తీసుకెళ్లారని కవిత ప్రశంసించారు.. అదేవిధంగా బాలయ్య నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ఘన విజయం సాధించాలని కోరుతున్నానని చెప్పారు.