TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

నాన్న కావాలని అనలేదు..

Published on: Fri Mar 2, 2018 4:32PM

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీని.. మోడీ గాడు అని వ్యాఖ్యానించడం పెద్ద దుమారమే రేపింది. కేసీఆర్ పై బీజేపీ నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇక ఈ విషయంపై  రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్  కూడా స్పందించి కేటీఆర్ తో మాట్లాడానంటూ చెప్పారు. అయితే తాజాగా ఈ అంశం గురించి కేసీఆర్ కూతురు.. టీఆర్ఎస్ ఎంపీ కవిత స్పందించారు.  ప్రధాని మోదీని అవమానించాలనే ఉద్దేశం కేసీఆర్ కు ఏ కోశానా లేదని... కేసీఆర్ ది అలాంటి సంకుచిత స్వభావం కాదని ఆమె అన్నారు. తన ప్రసంగం సందర్భంలో.. ఏదో ఫ్లోలో అలా వచ్చేసిందని.. చిన్న పొరపాటును బీజేపీ నేతలు పెద్దది చేయాలనుకోవడం సరికాదని.. రైతుల పట్ల ఆవేదనతోనే కేసీఆర్ కాస్త కటువుగా మాట్లాడారని చెప్పారు. అంతేకాదు ప్రత్యేక హోదా విషయంలో 2014 నుంచే ఏపీకి తాము మద్దతు ఇస్తున్నామని కవిత అన్నారు. విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చాల్సిందేనని డిమాండ్ చేశారు. మరి ఫ్లోలో అలా వచ్చేసిందే... కావాలనే అన్నారో తెలియదు కానీ.. కేసీఆర్ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు...