మోడీ కావాలని ఎవరూ కోరుకోవడంలేదు...

 

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన సంగతి తెలిసిందే కదా. కేంద్రం చేసిన ఈ పనికి తెలుగు రాష్ట్రాల ప్రజల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో పలువురు రాజకీయాలు కేంద్రం చేసిన పనిని ఎండగట్టాయి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎంపీ కవిత కూడా కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ విషయం లో బీజేపీ మీద మేమూ తెలంగాణా జనాలూ చాలా సీరియస్ గా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా…ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ…బయ్యారంలో ఉక్కు కర్మాగారం…ఐఐఎం… ఎయిమ్స్….పసుపు బోర్డులను ప్రస్తావించినా… మరిన్ని వరాలివ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ విన్నపాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. ” అంటూ ఆమె సీరియస్ గా మాట్లాడారు. అంతేకాదు రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంపై కూడా ఆమె స్పందించి... మోడీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

” రాజస్థాన్ లో బీజేపీ ఓడిపోవడం అనేది పెద్ద వింతా విశేషం ఏమీ కాదు, మేమేప్పుడో దీన్ని ఊచించిందే .. తెలంగాణాలో బీజేపీ వీక్ అయినా… ఇదివరకటి సర్వేలలో 15-20% మోడీ ప్రధాని కావాలని కోరుకునేవారు. ఈ మధ్య నిర్వహించిన సర్వేలలో అది 5% కు పడిపోయింది. మోడీ గ్రాఫ్ తొందరగా పడిపోతుందని అన్నారు. అంతేకాదు 2019లో కేంద్రంలో ఎవరు అధికారంలోకి రావాలన్నా టీఆర్ ఎస్ మద్దతు లేకుండా కుదరదని ధీమా వ్యక్తం చేశారు.