ఎంపి ఎన్నికల్లో కెసిఆర్ కు షాక్ ఇచ్చిన టిఆరెస్ ఎమ్మెల్యేలు

తెలంగాణలో జరిగిన ఎంపి ఎన్నికల్లో టిఆరెస్ పార్టీ పదహారుకు పదహారు సీట్లు గెలవాలని వ్యూహం రచించినా ఆ పార్టీ కేవలం 9 సీట్లలో మాత్రమే నెగ్గిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా కెసిఆర్ కుమార్తె కవిత ఓటమి టిఆరెస్ శ్రెణులకు అలాగే సిఎం కెసిఆర్ కు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ షాక్ తో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ఎన్నికల పై స్వయంగా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన విశ్లెషణలో కొన్ని షాకింగ్ నిజాలు బయట పడుతున్నట్లుగా సమాచారం. నిజామాబాద్ లొ కొంత మంది ఎమ్మెల్యేలు మాజి ఏంపి కవిత గెలుపు కోసం మనసు పెట్టి పనిచేయలెదని తెలుస్తోంది. ఇదే విషయమై కవిత తన తండ్రి ముఖ్యమంత్రి కెసిఆర్కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మరో నియోజకవర్గం భువనగిరి విషయంలో మరొ షాక్ ఏమిటంటే కొంతమంది టిఆరెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డికి సహకరించినట్టు, దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు కూడ సొషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. టిఆరెస్ లో కెసిఆర్ ఆదేశాలను కూడ లెక్క చేయకపోవటం ఇదే మొదటి సారి కావడంతో ఇప్పుడు కెసిఆర్ ఈ నాయకులతొ ఏ విధంగా వ్యవహరిస్తారొ అని టిఆరెస్ శ్రేణులు ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి.