నడ్డాను ఉరికించి కొడతాం! టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలనం..

posted on: Jan 5, 2022 11:45AM

తెలంగాణ పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ నేత జేపీ నడ్డాపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ లీడర్లు.. గల్లీ లీడర్లు రాసిన స్క్రిప్ట్‌ చదువుతున్నారని అన్నారు. జేపీ నడ్డా సీఎం కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పాలని... లేకుంటే బెంగాల్‌లో మాదిరిగా ఉరికించి కొడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిల్లర మాటలు మాట్లాడితే.. ఉన్న మూడు సీట్లు కూడా పోతాయన్నారు. బండి సంజయ్‌, అరవింద్‌పై పీడీ యాక్ట్‌ పెట్టాలని డిమాండ్ చేశారు. 

 హైదరాబాదులోని బీజేపీ కార్యాలయంలో  మంగళవారం మీడియా సమావేశం నిర్వహించిన జేపీ నడ్డా.. సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటముల తర్వాత కేసీఆర్ కు మతిభ్రమించినట్టుందని విమర్శించారు. అవివేకంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతిమయం అయిందని, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...