అసెంబ్లీ వద్ద ఎమ్మెల్యేలు అరెస్ట్

 

trs mla arrested, bjp mla arrested, telangana Chalo Assembly march, ktr arrested

 

 

అసెంబ్లీ ప్రాంగణంలో ఆందోళనకు దీగిన టీఆర్ఎస్, బిజెపి, సీపీఐ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ గేట్-1, గేట్- 2 వద్ద ఆందోళనకు దీగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, కేటీఆర్ ఆపార్టీ ఎమ్మెల్యేలతో పాటు, బిజెపి ఎమ్మెల్యే యండేల లక్ష్మీనారాయణ తదితరులతో పాటు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన ఎమ్మెల్యేలను గోల్కొండ పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు. అసెంబ్లీ గేట్-1 సీఎం, మంత్రుల ప్రవేశద్వారం వద్ద టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. హరీష్‌రావు, ఈటెల నేతృత్వంలో సీఎం దిష్టి బొమ్మను దహనం చేశారు. మంత్రుల కాన్వాయ్‌ను ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారు.