TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హరీష్‌రావు ఇలాకాలో తగ్గిన మెజారిటీ

Published on: Tue Sep 16, 2014 12:42PM

 

మెదక్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ మంత్రి హరీష్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలో ఓట్లు తగ్గాయి. సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో టీఆర్ఎస్‌కి 86,300 ఓట్ల మెజార్టీ లభించింది. గత ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్ కు 6 వేల ఓట్లు తగ్గాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌కి 97 వేల ఓట్లు లభించాయి. సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో బీజేపీ రెండోస్థానంలో నిలిచింది. కాంగ్రెస్ కు మూడో స్థానం దక్కింది.