జీహెచ్ఎంసీ.. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితాను విడుదల
Published on: Sat Jan 16, 2016 10:24AM
.jpg)
గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా డివిజన్ల వారీగా అభ్యర్థుల విషయంలో తెలంగాణ అధికారపక్షం నిన్న రెండు జాబిజాలు విడుదల చేసింది. టీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు అభ్యర్దులు జాబితాను విడుదల చేశారు. గ్రేటర్లో మొత్తం 150 డివిజన్లకుగాను టీఆర్ఎస్ పార్టీ ముందుగా 60 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. అనంతరం మరో 20 మందితో ఇంకో జాబితాను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన వారికే స్థానం దక్కిందని.. ఈ ఎన్నికల్లో మహిళలకు పెద్ద పీట వేసినట్లుగా పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి 45 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మొత్తానికి ఒక్కరోజులో 80 మంది అభ్యర్దుల జాబితా విడుదల చేసిన టీఆర్ఎస్ పార్టీలో తమ పార్టీ గెలుపుపై వారికి గట్టి నమ్మకం ఉన్నట్టు తెలుస్తోంది.


