TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీఆర్ఎస్ అనుమానాలకు మావోయిస్టుల క్లియరన్స్

Published on: Sun Jan 29, 2012 8:17AM

హైదరాబాద్ : టీఆర్ఎస్ నేతల అనుమానాలను మావోయిస్టులు పటాపంచలు చేశారు. కేసీఆర్, తెలంగాణ జేఏసీ నేతలను విమర్శిస్తూ వెలువడిన ప్రకటనలు తమ పార్టీ ఇచ్చినవేనని స్పష్టం చేశారు. "తెలంగాణ పోరాటంలో త్యాగాల చరిత్ర మాకే ఉన్నదని తేల్చి చెప్పారు. కేసీఆర్ చేస్తేనే ఉద్యమమా అని నిలదీశారు. సకల జనుల సమ్మెను కేసీఆర్ అమ్ముకున్నాడనేది ముమ్మాటికి నిజమని స్పష్టం చేశారు.ఈ మేరకు ఉత్తర తెలంగాణ ప్రతినిధి జగన్  మరోసారి 'ఆన్‌లైన్'తో మాట్లాడారు.వారికి దమ్ముంటే ప్రజల్లోకి వచ్చి ఉద్యమించాలి'' అన్న టీఆర్ఎస్ నేత నాయిని సవాల్‌పై స్పందిస్తూ.. ఉనికి కోసమే మేం మాట్లాడుతున్నామనడం అర్ధరహితం. కేసీఆర్, కోదండరాం, స్వామిగౌడ్ ఢిల్లీకి తాకట్టు పెట్టారన్నది నా ఒక్కడి అభిప్రాయమే కాదు. మా పార్టీ పత్రిక 'క్రాంతి'లో సమ్మె విజయాలు, వైఫల్యాలు, నేతల నిజ స్వరూపంపై ఇప్పటికే వివరంగా విశ్లేషించాం'' అని వివరించారు. సమ్మె విరామంలో దాగిన విద్రోహాన్ని గుర్తించాలని ఉద్యమ ప్రజలకు పిలుపునిచ్చారు.

 సకల జనుల సమ్మెలో సర్వం కోల్పోవడానికి సిద్ధపడింది ఉద్యోగులు, కార్మికులు, ప్రజలైతే, సర్వనాశనం చేసింది రాజకీయ పార్టీల నేతలే.  దీనికి కారకులైన విద్రోహులకు ప్రజలే గుణపాఠం చెబుతారు. వీరిని గ్రామాలకు రాకుండా తరిమికొడితేనే రాష్ట్ర సాధన సాధ్యం'' అని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని నిజాయితీగా తీసుకెళ్లాలనేదే మా డిమాండ్.'' అని పేర్కొన్నారు. ప్రజలే చరిత్ర నిర్మాతలన్న విషయం మరిపోవద్దని కేసీఆర్‌ను ఉద్దేశించి పరోక్షంగా హెచ్చరించారు. "కేసీఆర్ ఉద్యమిస్తే ఉద్యమం. లేకుంటే ఏమీ లేనట్టేనా'' అని ప్రశ్నించారు. ప్రజాసంఘాల జేఏసీ నేత గజ్జెలకాంతాన్ని వదిలిపెట్టలేదు. "నిజాయితీ లేని వ్యక్తులు మా సచ్ఛీలతను, వైఖరిని ప్రశ్నించడం హాస్యాస్పదం'' అని ఘాటుగా స్పందించారు. న్యాయమైన జూనియర్ డాక్టర్ల సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు జగన్ ప్రకటించారు. కార్పొరేట్ ఆస్పత్రులపై సర్కారుకు ఉన్న ప్రేమ పేదల ఆస్పత్రులపై, డాక్టర్ల సమస్యల పరిష్కారంపై లేదని ధ్వజమెత్తారు. సమ్మెకు మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలు, ప్రజాస్వామిక వాదులకు పిలుపునిచ్చారు.