టీఆర్ఎస్ ఎంపీ కవిత ఇంట్లో కూలిన లిఫ్ట్

 

 

 

బ్రేకింగ్ న్యూస్... టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత నివాసంలో ప్రమాదం జరిగింది. ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన లిఫ్ట్ ప్రమాదానికి గురైంది. కింది ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్‌కి ప్రయాణిస్తున్న లిఫ్ట్ ఒక్కసారిగా తెగిపోయి కిందపడిపోయింది. దాంతో ఆ లిఫ్ట్.లో ప్రయాణిస్తున్న మాజీ ఎమ్మెల్యే రత్నం గాయపడినట్టు తెలుస్తోంది. ఆయన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.