ధర్మపురిలో ఒక్క స్థానం తేడాతో మునిసిపల్ చైర్మన్ కైవసం చేసుకున్న టీఆర్ఎస్!!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ దూసుకుపోతోంది. పలుచోట్ల టీఆర్ఎస్ అభ్యర్ధులు విజయాలు సాధించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మునిసిపాల్టీల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ హోరాహోరీ తలపడ్డాయి. చివరికి ఒక్క వార్డు తేడాతో టిఆర్ఎస్ ధర్మపురిలో గట్టెక్కింది. సాక్షాత్తూ మంత్రి కొప్పుల ఈశ్వర్ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ధర్మపురి మునిసిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉన్నాయి. అక్కడ ఎనిమిది వార్డుల్లో టీఆర్ఎస్ గెలిచింది. ఏడు వార్డుల్లో కాంగ్రెస్ గెలిచింది. ఒక్క వార్డు తేడాతో టీఆర్ఎస్ మునిసిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నట్లు స్పష్టంగా మనకు తెలుస్తుంది.

అయితే ముందు నుంచి కొంత కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మన్ ధర్మపురి ఇంచార్జిగా ఉన్నారు. మెజారిటీ స్థానాల్లో గెలిచింది ఒక్క వార్డు తేడాతో మాత్రమే గనుక టీఆర్ఎస్ మునిసిపల్ చైర్మన్ కైవసం చేసుకుంది. ఏడు వార్డుల్లో గెలవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అక్కడ మంత్రి కూడా ఉన్నారు. ఇక ప్రధానంగా ఈ మున్సిపాలిటీలో ఉన్న పలువురు అభ్యర్థుల ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయి. మరి వాళ్లు ఏ పార్టీకి సంబంధించిన క్యాంపు రాజకీయంలోకి వెళ్లారు అనేది ఇప్పటి వరకు తెలియడం లేదు. ఒకరిని లేదా ఇద్దరిని లాగేసుకుంటే లేదా తమ వైపు తిప్పుకుంటే చైర్మన్ కాంగ్రెస్ అయ్యే అవకాశముంది. దీంతో ఈ రెండు రోజులు అంటే మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక అయ్యే వరకు ధర్మపురిలో హైడ్రామా కొనసాగుతూనే ఉంటుంది.