TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇది తెరాస ప్రభుత్వమా? లేక తెదేపా ప్రభుత్వమా?

Published on: Tue Jan 27, 2015 11:32AM

 

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంద్ర ప్రభుత్వాన్ని, తెదేపా దాని మంత్రులను, నేతలను ఎంతగా విమర్శిస్తున్నప్పటికీ ఒకప్పుడు తనకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించిన తెదేపా పట్ల ఆయనకు చాలా మమకారం ఉన్నట్లే కనబడుతోంది ప్రస్తుత మంత్రివర్గం చూస్తుంటే. ఆయన స్వయంగా తెదేపా నుండి వచ్చిన మనిషి. స్వైన్ ఫ్లూ దెబ్బకి టి.రాజయ్య ఉపముఖ్యమంత్రి పదవి కోల్పోతే, ఆయన స్థానంలోకి ఇప్పుడు తెదేపా నుండి వచ్చిన కడియం శ్రీహరికి అవకాశం దక్కింది.

 

ఇక ఇంతకుముందే కేసీఆర్ మంత్రివర్గంలో తెదేపా నుండి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర రావు, అజ్మీరా చందూలాల్ మరియు పి. మహేంద్ర రెడ్డి చేరారు. వారు కాక జోగు రామన్న, తీగల కృష్ణారెడ్డి, గంగుల కమలాకర్, రమణాచారి, ఇంద్ర కరణ్ రెడ్డి వంటి అనేకమంది తెదేపాకు చెందిన నేతలు అందరూ తెరాస గొడుగు క్రిందకి వచ్చి జేరడంతో ఇప్పుడు తెరాస నేతలకి చోటు మిగలడం లేదు. వారి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ మళ్ళీ తెదేపా నేతలందరూ ఈవిధంగా ఒకచోట చేరడంతో తెలంగాణాలో కూడా తమ పార్టీయే అధికారంలోకి వచ్చినట్లుందని తెదేపా తమ్ముళ్ళు తెగ సంబరపడిపోతుంటే తెరాస నేతలకు ఏమనాలో అర్ధం కావడం లేదు.