TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెరాస ఇక గతం..!

Published on: Thu Oct 6, 2022 6:48AM

రాజకీయ పార్టీగా తెరాస (తెలంగాణ రాష్ట్ర సమితి) ఇక లేదు. ఉద్యమ పార్టీగా అవతరించి.. రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన తెరాస ఇక కనుమరుగైపోయింది. తెరాస స్థానంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అవతరించింది. ఈ మేరకు దసరా రోజున (అక్టోబర్5) తెరాసను జాతీయ పార్టీగా మారుస్తూ, ఆ పార్టీకి భారత్ రాష్ట్ర సమితిగా నామకరణం చేస్తూ తెరాస ఏకగ్రీవంగా తీర్మానించింది. జాతీయ పార్టీగా మారుస్తూ ఏక‌గ్రీవ తీర్మానం చేశారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చడంతో పాటు టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.  తెరాస ఆవిర్భావ కార్యక్రమానికి కర్నాటక మాజీ ముఖ్యమంతి, జేడీఎస్‌ నేత హెచ్ డి కుమారస్వామి, ఆయన పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధినేత తిరుమావళన్‌తో పాటు ఎంపీలు   హాజరయ్యారు. ప్రస్తుతం జాతీయ పార్టీగా ఎందుకు మారుస్తున్నామో సభ్యులకు కేసీఆర్‌ వివరించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మారుస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.

తీర్మానానికి ఆమోదం తెలుపుతూ 283 మంది సభ్యులు ఆమోద ముద్ర వేశారు. ఆ తర్వాత సంతకాలు చేశారు. అయితే కార్యవర్గ సమావేశం చేసిన తీర్మానం మేరకు టీఆర్ఎస్ ఇక లేదు. బీఆర్ఎస్ ఆవిర్భవించింది.  

అయితే ఇందుకు ఈసీ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దాంతో ఈ తీర్మానంతో .. టీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఢిల్లీ వెళ్లింది. ఎన్నికల సంఘానికి ఈ తీర్మానాన్ని సమర్పించి తెలంగాణ రాష్ట్ర సమితి పేరును  భారత రాష్ట్ర సమితిగా మార్పు చేయిస్తుంది.  కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర పడేంత వరకూ మాత్రమే టీఆర్ఎస్ అధికారికంగా ఉనికిలో ఉంటుంది. ఆ తరువాత తెరాస ఇక ఉండదు.