మళ్లీ సొంత గూటికి డీఎస్...

 

రాజకీయాల్లో జంపింగ్స్ మామూలే. ఒక పార్టీ నుండి మరో పార్టీకి జంప్ అవ్వడం.. ఒకవేళ ఆపార్టీలో కనుక తగిన ప్రాధాన్యత లేకపోతే మళ్లీ సొంత గూటికి రావడం కామన్ థింగ్. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా అదే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఓ కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని వీడి డీఎస్ టీఆర్ఎస్ పార్టీలోకి  జంప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. గాంధీభవన్ లో పీసీసీ బీసీ సెల్ నేతల సమావేశం సందర్భంగా కూడా ఈ విషయం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డీఎస్ టీఆర్ఎస్ కు ఎందుకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నారు? కాంగ్రెస్ లోకి మళ్లీ ఎందుకు రావాలనుకుంటున్నారు? అనే విషయంపై చర్చ సాగింది. మరోవైపు డీఎస్ ఇప్పటికీ సోనియాగాంధీతో టచ్ లో ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.