TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్రిక్తత

Published on: Fri May 31, 2019 11:51AM

 

నల్లగొండలో స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ సందర్భంగా టీఆర్ఎస్- కాంగ్రెస్ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఉదయం పోలింగ్‌ ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ క్లాక్‌టవర్‌ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే  భూపాల్‌రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. ఇద్దరు నేతలు ఎదురుపడటంతో వారి అనుచరులు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. ఎవరికివారు తమ నేతకు అనుకూలంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. కోమటిరెడ్డి గోబ్యాక్ అంటూ టీఆర్ఎస్ నాయకులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపు చేశారు.