TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెరాస పల్లెబాట

Published on: Mon Oct 29, 2012 4:07PM

TRS, Telangana Bata, Chandrababu Naidu Padayatra, Telangana Districts, YS Jagan Sister, Sharmila Padayatra, KCR Meetings in Delhi, Bus Yatras, November First Week,

 

తెలంగాణ జిల్లాల్లో చంద్రబాబు పాదయాత్ర విజయవంతంగా సాగుతుండడం, మరోవైపు జగన్‌ సోదరి షర్మిల పాదయాత్ర చేస్తుండడంతో తాము కూడా యాత్ర చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఢల్లీ పెద్దలతో ఇటీవల కెసిఆర్‌ పలుదఫాలు చర్చలు జరిపారు. దసరాలోపే తెలంగాణపై  కేంద్రంనుంచి ప్రకటన వస్తుందని కూడా ఆయన ప్రకటించారు. అయితే కేంద్రంనుంచి అటువంటి ప్రకటన ఏదీ రాలేదు. అంతర్గత సమస్యల కారణంగా కేంద్రం తెలంగాణపై ప్రకటన చేయలేదా, లేకపోతే అటువంటి ఉద్దేశమే లేదా అన్నది కెసిఆర్‌కు అంతుపట్టడం లేదు. ఏది ఏమైనా తెలంగాణ ఉద్యమం ఉధృతి తగ్గకుండా వుండేందుకు గ్రామగ్రామాన బస్సు యాత్రలు చేపట్టడానికి తెరాస నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధివిధానాలను నవంబరు మొదటివారంలో ఖరారు చేసే అవకాశం వుంది.